ఆ హీరోయిన్‌ గురించి రహస్యంగా అలా అనుకునేదాన్ని: సమంత

11 Jun, 2021 14:01 IST|Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత అంటే పడిచచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. తన నటనతో, అందచందాలతో ఎంతోమందిని బుట్టలో వేసుకుందీ సుందరి. ఎంతోమందికి ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలిచే సామ్‌ తనకు మాత్రం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ స్ఫూర్తి అని చెప్తోంది. దీపికా పదుకోన్‌ స్టైలింగ్‌ తనకు ఎంతో ఇష్టమని బాహాటంగానే ఒప్పేసుకుంది.

తాజాగా సమంత జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను దీపిక పదుకోన్‌ను కాపీ కొడతానని అంగీకరించింది. దీపిక ఎంతో అందంగా ఉంటుందని, ఆమె మనిషి రూపంలో ఉన్న దేవతనా? అని రహస్యంగా అనుకునేదాన్నని చెప్పుకొచ్చింది. ఆమె ఫ్యాషన్‌ అంటే ఎంతో ఇష్టమన్న సామ్‌ దాన్ని ఫాలో అవుతానని తెలిపింది.

కాగా సమంత తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌ 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'కు విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో నటించిన నటీనటులందరికీ మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. ఇదిలా వుంటే సామ్‌ ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పాన్‌ ఇండియా మూవీలో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్‌’ అనే సినిమాలోనూ నటిస్తోంది.

చదవండి: ఆ హీరోతో నటించాలనుంది : సమంత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు