‘పుష్ప’లో తన క్యారెక్టర్‌ ఏంటో చెప్పిన అనసూయ.. అదే కీలకం అట

4 May, 2021 18:57 IST|Sakshi

అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తాచాటుతుంది హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌. టీవీ యాంకర్‌గా కొనసాగుతూనే, అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంది. ఇక రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు సినిమా అవకాశాలు భారీగానే వచ్చాయి. కానీ ఆమె మాత్రం వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో ఆమె చేసిన స్పెషల్‌ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ ప్రధాన పాత్రలో నటించిన 'థాంక్యూ బ్రదర్' విడుదలకు సిద్దంగా ఉంది. మే 7న ఈ సినిమా ఆహా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది.

ఇక దీంతో పాటు  అల్లుఅర్జున్‌, సుకుమార్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’లోనూ కీలకపాత్ర పోషిస్తుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా అందరికి ఆకట్టుకున్న అనసూయ.. పుష్పలో కూడా అంతే ప్రాధాన్యమున్న పాత్ర చేయబోతుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ పుష్పలో తన క్యారెక్టర్‌ ఏంటో చెప్పి చెప్పనట్లుగా ఓ సమాధానం చెప్పింది. పుష్పలో నా క్యారెక్టర్‌ ఏంటో చెప్పను కానీ, సినిమాకు మాత్రం ఆ పాత్ర చాలా కీలకం. సినిమాకి టర్నింగ్‌ పాయింట్‌ అయ్యేలా నా పాత్రను తీర్చిదిద్దాడు సుకుమార్‌. రంగమ్మత్త కంటే గొప్ప పాత్ర ఇందులో చేయబోతున్నాను’అని అనసూయ చెప్పుకొచ్చింది.

ఇక పుష్ప సినిమా విషయాకొస్తే.. పాన్‌ ఇండియాలో స్థాయిలో దీనిని రూపొందిస్తున్నాడు దర్శకుడు సుకుమార్‌. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో బన్నికి జోడిగా రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫజల్ విలన్‌గా కనిపించనున్నాడు. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల కానుంది. కానీ కరోనా కారణంగా ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం మెండుగా ఉన్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు