ఈద్ గెటప్‌లో బాలకృష్ణ రంజాన్‌ శుభాకాంక్షలు.. వీడియో వైరల్‌

14 May, 2021 11:23 IST|Sakshi

Eid Mubarak : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందమూరి నట సింహం బాలక‌ృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఈద్‌ గెటప్‌లో ఓ వీడియోని విడుదల చేశారు బాలకృష్ణ

‘ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్‌ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవానిరతి మారుపేరు రంజాన్‌ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్దలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో  ఈ రంజాన్‌ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణతోపాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి:
ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు