స్టార్‌ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో, ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా?

27 Jun, 2021 14:00 IST|Sakshi

సోఫాపై నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? కష్టం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి  క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆమె ఓ స్టార్‌ హీరోయిన్‌. ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’చేసింది. సౌందర్య తరువాత గ్లామర్ తో కాకుండా తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ  నేచురల్‌ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈ క్లూతో అయినా ఆమెను గుర్తించారా? ఓకే.. మీరనుకుంటున్నట్లు ఈ ఫోటో నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవిదే. ఈ హైబ్రీడ్‌ పిల్ల చిన్నప్పుడు మస్తు అల్లరి చేసేదట .కాలేజీ రోజుల్లో అయితే తోటి స్నేహితులను ఆటపట్టిస్తూ.. రచ్చ రచ్చ చేసేదట. సాయి పల్లవి ఉంటే చాలు ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే ఉండేదికాదట. ప్రస్తుతం  ఆమె చిన్నప్పటి ఫోటోతో పాటు కాలేజీ పిక్‌ కూడా  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయి పల్లవి కాలేజీ ఫోటో

ఇక సాయిపల్లవి సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమా లో నటిస్తోంది. అలాగే  రానా ‘విరాటపర్వం , నాని ‘శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ మూడు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు