ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన అలీ..అందుకోసమేనా?

9 Jul, 2021 12:12 IST|Sakshi

సోషల్‌ మీడియా పుణ్యమా అని చాలామంది యూట్యూబ్‌, ఇన్‌స్టా స్లార్లుగా పుట్టుకొచ్చారు. ఇక ప్రముఖ హీరో, హీరోయిన్లు సైతం సైతం సినిమా ప్రమోషన్స్‌ కోసం వీళ్ల సాయం కోరతారంటే ఈ సోషల్‌ స్టార్స్‌ హవా ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో సెలబ్రిటీలు కూడా సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటిదాకా డిజిటల్‌ మీడియాకి దూరంగా ఉన్న పలువురు స్టార్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాకి వచ్చేశారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ కమెడియన్‌ అలీ కూడా చేరిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చీ రావడంతోనే 23వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. ఇక ఇన్‌స్టా ఎంట్రీ సందర్భంగా అలీ చేసిన మొదటి పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇన్‌స్టాలోకి రావడం రావడంతోనే తన సొంత సినిమాను ప్రమోట్‌ చేసుకున్నారు అలీ. అలీ సొంత బ్యానర్‌లో రూపొందిన 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే చిత్రంలోని ఓ సాంగ్‌ షూట్‌ సందర్భంగా తీసుకున్న ఫోటోనే ఇన్‌స్టా మొదటి పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇది  అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ అని, ఇకపై ఈ అకౌంట్‌ను తానే హ్యాండిల్‌ చేస్తున్నట్లు అలీ పేర్కొన్నారు. ఇక అలీ ఇన్‌స్టా అకౌంట్‌పై పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తూ 'వెల్‌కం టూ ఇన్‌స్టా ఫ్యామిలీ అలీగారు' అంటూ పోస్టులు షేర్‌ చేసుకుంటున్నారు.


మరోవైపు సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడం బిగ్‌బాస్‌ కోసమేనా అని కొందరు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో అతి త్వరలోనే బిగ్‌బాస్‌ సీజన్‌-5 ప్రసారం అవ్వనున్న సంగతి తెలిసిందే. సీజన్‌-5లో పాల్గొనాల్సిందిగా ఇప్పటికే బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు అలీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సడెన్‌గా అలీ ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వడంతో ఇది బిగ్‌బాస్‌ కోసమేనంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

A post shared by Ali (@ali_the_actor)

మరిన్ని వార్తలు