టాప్‌ లెస్‌ ఫోటోస్‌తో రచ్చ చేస్తున్న బాలీవుడ్‌ బ్యూటీ

11 Oct, 2021 21:08 IST|Sakshi

ఇటీవల కాలంలో హీరోయిన్లు, మోడల్స్‌ శృతిమించిన అందాల విందుతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఎంత అందంగా కనిపిస్తే అంత ఎక్కువ అవకాశాలు, పాపులారిటీ సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయంతో తెగ హాట్స్‌ లుక్స్‌తో దర్శనమిస్తున్నారు. ఇంకా వీటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింటా కావాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది బాలీవుడ్‌ బ్యూటీ ఈషా గుప్తా. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ అభిమానులు అలరిస్తున్న ఈ బోల్డ్‌ భామ.. గ్లామర్‌ ఫోటోషూట్‌లతోనూ ఎప్పటికప్పుడు హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంది.
చదవండి: Mani Sharma: వైరలవుతోన్న మణిశర్మ కుమారుడి నిశ్చితార్థపు ఫోటోలు

ఈ క్రమంలోనే ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోస్‌ షేర్ చేసింది. ప్రస్తుతం జైపూర్‌ వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఈషా తన రిసార్ట్‌లోని బాల్కనీ వద్ద దిగిన హాట్‌ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఇన్‌స్టాలో అయిదు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఈ అందాల భామకు బోల్డ్‌గా కనిపించడం కొత్తేం కాదు. ఇంతకముందు చాలాసార్లే బికినీ ఫోజులతో కనువిందు చేసింది. కానీ ఈసారి మరింత రెచ్చిపోయి ఏకంగా టాప్‌లెస్‌గా సెమీ న్యూడ్‌ ఫోటోలతో ఇంటర్నెట్‌లో సెగలు రేపుతోంది.  జీన్స్ ప్యాంట్ మినహా ఒంటిపై నూలుపోగు లేకుండా ఘాలుగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.
చదవండి: Shriya Saran: పం‍డంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ శ్రియ

మరిన్ని వార్తలు