కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’!

17 Jun, 2021 16:55 IST|Sakshi

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలకు గుడ్‌బై చెబుతారు. కొంతమంది సినిమాలు చేసినా.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా  తెరపై చాలా పద్దతిగా కనిపిస్తుంటారు. అయితే కొంతమంది నటీమణులు మాత్రం కెరీర్‌, వ్యక్తిగత జీవితం వేరు అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా గ్లామర్‌ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సమంత అక్కినేని పెళ్లి తర్వాత సంచలన పాత్రలు చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కాజల్‌ అగర్వాల్‌ కూడా చేరింది. 

గతేడాది గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్.. ఆ తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ‘చందమామ’ మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌ ‘ఇండియన్‌-2’లో నటిస్తుంది. వీటితో పాటు  నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ  చిత్రంలో కాజల్ స్పై పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ పాత్ర వేశ్య కూడా అని తెలుస్తోంది.

నాగార్జున ఇందులో రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తుంది. సినిమాలో ఈమె ఎక్కువ భాగం వేశ్యగా.. చివర్లో మాత్రం స్పైగా కనిపించబోతుందట.  తీవ్రవాదుల గుట్టు రట్టు చేయడానికి తన అందచందాలతో వాళ్లను ఆకట్టుకుంటూ.. వాళ్ళతో రొమాన్స్ చేస్తూ అక్కడి రహస్యాలను తన డిపార్ట్మెంట్ కు అందజేసే పాత్ర ఇది. ఒకవైపు గూడాచారి, మరోవైపు వేశ్య ఈ రెండూ కలగలిపి ఉన్న పాత్రను కాజల్ అద్భుతంగా పోషిస్తుందని తెలుస్తోంది.అంతే కాదు ఈ సినిమాలో యాక్షన్‌ సీక్వెన్స్‌లో కూడా కాజల్‌ నటించబోతుందట. ఏదేమైనా.. పెళ్లి తర్వాత ఇలాంటి పాత్రలు చేయడం చిన్న విషయమేమి కాదు. తెరపై వేశ్యగా కాజల్‌ ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి మరి.
చదవండి:
నగ్నంగా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు