హల్‌చల్ చేస్తోన్న ‘రంగ్‌దే’ మేకింగ్‌ వీడియో..‌‌

23 Mar, 2021 15:26 IST|Sakshi

టాలీవుడ్‌ హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'రంగ్​ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషనల్లో చిత్రయూనిట్‌ బిజీగా ఉంది. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్‌ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చగా పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్‌ నూలి ఎడిటర్‌.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘చూసి నేర్చుకోకు’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో కొన్ని మేకింగ్‌ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్‌, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి. ఇదిలా ఉండగా మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆదివారం సాయంత్రం(మార్చి 21)శిల్పకళావేదికలో జరిగే ప్రీ రిలీజ్‌ వేడుకకుముఖ్య అతిథిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రానున్న విషయం తెలిసిందే. గతేడాది నితిన్‌ హీరోగా నటించిన ‘భీష్మ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. దీంతో ఆ సెంటిమెంట్‌తోనే రంగ్‌దే సినిమాకి త్రివిక్రమ్‌ని ముఖ్య అతిథిగా పిలిచిననట్లు తెలుస్తోంది.

చదవండి:
తలైవి ట్రైలర్‌ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు

రంగ్‌దే ప్రీ రిలీజ్‌: చీఫ్‌‌ గెస్ట్‌గా అతనే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు