వైరల్‌: పాక్‌ పీఎం, బాలీవుడ్‌ హీరోయిన్‌ లవ్‌ స్టోరి

12 May, 2021 19:46 IST|Sakshi

పాత తరం హీరో హీరోయిన్ల ప్రేమ కథలు అనగానే టక్కున గుర్తుకు వచ్చే జంట అమితాబ్‌ బచ్చన్‌-రేఖ. పెళ్లైందని తెలిసి కూడా అమితాబ్‌ని ప్రేమించారు రేఖ. కానీ జయా బచ్చన్‌ కఠినంగా వ్యహరించడంతో వీరి ప్రేమకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ రేఖ జీవితంలో మరో లవ్‌ స్టోరీ కూడా ఉందట. అది కూడా మన దాయాది దేశ క్రికెటర్‌తో. ప్రస్తుతం వీరి లవ్‌స్టోరికి సంబంధించిన ఓ పేపర్‌ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకు ఎవరా క్రికెటర్‌ అని ఆలోచిస్తున్నారా.. మరేవరో కాదు.. ప్రస్తుత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. అవును రేఖ, ఇమ్రాన్‌లు ప్రేమించుకున్నారని.. వారి బంధం పెళ్లి వరకు వెళ్లిందనేది ఆ క్లిప్పింగ్‌ సారాంశం. 

క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌ అయిన ఇమ్రాన్‌ సారథ్యంలో 1992లో పాక్‌ జట్టు వరల్డ్‌ కప్‌ కూడా గెలుచుకుంది. ఇక అప్పట్లో ఇమ్రాన్‌కు లేడీ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉండేది. వీరిలో మన దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు. గతంలో ఇరు దేశాల మధ్య తరచుగా ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లు జరిగేవి. దాంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలు, క్రికెటర్ల్‌ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఇమ్రాన్‌కు పలువురు బాలీవుడ్‌ అందాల హీరోయిన్లతో పరిచయం ఏర్పడింది. 

అలా ఇమ్రాన్‌కు పరిచయం అయిన బాలీవుడ్‌ హీరోయిన్లలో రేఖ కూడా ఉన్నారు. అయితే వీరిద్దరి పరిచయం కాస్త ముందుకు వెళ్లింది. రేఖతో రిలేషన్‌ కారణంగా ఇమ్రాన్‌ అడపదడపా ఇండియా వచ్చేవారు. వీరిద్దరి విషయం రేఖ తల్లికి కూడా తెలుసు. ఆమె కూడా వీరి రిలేషన్‌ పట్ల చాలా సంతోషించారని పేపర్‌ క్లిప్పింగ్‌ పేర్కొంది. ఒకానొక సమయంలో వీరిద్దరు వివాహం చేసకోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఓ నెల రోజుల పాటు ముంబైలోనే ఉన్నాడని క్లిప్పింగ్‌ కోట్‌ చేసింది. 

ఇమ్రాన్‌-రేఖలు బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారని.. ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉండేవారని.. చూసేవారికి లవర్స్‌గా కనిపించేవారని పేపర్‌ క్లిప్పింగ్‌లో ఉంది. అయితే కారణాలు తెలియదు కానీ ఆ తర్వాత విడిపోయారని రాసుకొచ్చింది. ఇక ఇమ్రాన్‌ రేఖతోనే కాక.. షబానా ఆజ్మి, జీనత్‌ అమాన్‌లతో కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించడని క్లిప్పంగ్‌ కోట్‌ చేసింది. 

ఈ క్లిప్పింగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు వీరిద్దరికి వివాహం జరిగి ఉంటే.. ఇండియా-పాక్‌ మధ్య చాలా సమస్యలకు పరిష్కారం దొరికేదేమో అని కామెంట్‌ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్‌లోనే సినిమా హీరోయిన్లతో తన డేటింట్‌ గురించి ఇమ్రాన్‌ ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్లతో కొద్ది రోజుల పాటు తిరగడం బాగానే ఉంటుంది. కానీ నా జీవితంలో సినిమా తారను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదని అనడం విశేషం.
 

A post shared by Sanam Maher (@topbastard)

చదవండి: 
సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు