కిస్‌ సీన్‌.. కట్‌ అంటే కట్‌ అంతే: హీరోయిన్‌

9 Jun, 2021 12:04 IST|Sakshi

రోజులు మారాయి. సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్‌ అంటే ముక్కున వేలేసుకొని వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. లిప్‌లాక్‌ సీన్స్‌ సర్వసాధారణం అయిపోయాయి. బాలీవుడ్‌లో ఇప్పుడు ప్రతి సినిమాలోనూ చుంబన దృశ్యం తప్పనిసరి అయిపోయింది. అయితే, ముద్దు సీన్లు తీయడం కూడా అంత ఈజీ కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు నటీనటులు ఇద్దరు మానసికంగా సిద్ధం కావాలి. అది కేవలం నటనలో భాగంగానే భావిస్తూ ముద్దు పెట్టుకోవాలనే సూత్రాన్ని పక్కాగా పాటించాలి.

 లిప్ కిస్ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫిలింగ్‌ కలుగుతుందో తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా వివరించింది. ‘రొమాంటిక్‌ సీన్స్‌ కూడా సాధారణ సీన్‌లాగే అనిపిస్తుంది. కిస్‌ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో కట్‌ అంటే కట్‌ అంతే. అంతకు మించి ఎలాంటి ఫీలింగ్‌ కలగదు. జస్ట్‌ సినిమా కోసమే అలా చేస్తాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి ఫిలింగ్స్‌ ఉండవు’అని పరిణీతి చెప్పుకొచ్చింది. 

పరిణీతి చోప్రా.. 'లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇటీవల సైనా అనే సినిమాతో వచ్చింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం చిత్రం ‘సైనా’. అమోల్‌ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 
చదవండి:
Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం
షారుక్‌, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్‌ రిప్లై ఇదే!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు