వైరల్‌: విలాసవంతమైన యశ్‌ ఇల్లు చూసేయండి

30 Mar, 2021 16:51 IST|Sakshi

కేజీఎఫ్‌ సినిమాతో కన్నడ రంగానికి కొత్త వెలుగు తీసుకొచ్చాడు హీరో యశ్‌. 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 1' చిత్రంతో రాక్‌స్టార్‌గా మారిన యశ్‌ను అభిమానులు ముద్దుగా రాఖీ భాయ్‌ అని పిలుచుకుంటారు.  ఆయన లాక్‌డౌన్‌లో తన ఫ్యామిలీతో బెంగళూరులోని తన నివాసంలో ఫుల్‌ ఎంజాయ్‌ చేశాడు. ఈ సందర్భంగా పిల్లలు, భార్యతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

సంప్రదాయ పద్ధతిలో ఉండే ఇంటి వాతావరణం, లోపలకు వెళ్లి చూస్తే ఇంద్రభవనాన్ని తలపించే సౌకర్యాలు ఫ్యాన్స్‌ను అబ్బురపరిచాయి. యశ్‌ రెండు సంవత్సరాలుగా ఉంటున్న ఈ ఇంటి ఫొటోలు తాజాగా మరోసారి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా కేజీఎఫ్‌ సక్సెస్‌ తర్వాత యశ్‌ సొంతిల్లు కొనుగోలు చేశాడు. బెంగళూరులోని పాపులర్‌ ఏరియాలో విలాసవంతమైన ఇంటిని కొనుక్కున్న యశ్‌ కుటుంబంతో కలిసి అందులోకి షిఫ్ట్‌ అయ్యాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ.4 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

యశ్‌ సినిమాల‌ విషయానికి వస్తే మొగ్గిన మనసు' చిత్రంలో సైడ్‌ క్యారెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించిన తర్వాత పలు సినిమాల్లో హీరోగా రాణించాడు. 'కేజీఎఫ్‌'తో కన్నడ సూపర్‌స్టార్‌గా మారాడు. 2018లో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్లు కలెక్షన్లు కురిపించి అప్పట్లో సంచలనం క్రియేట్‌ చేసింది. ఇక భారీ అంచనాలతో దీనికి సీక్వెల్‌గా వస్తోన్న కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 జూలై 16న రిలీజ్‌ అవుతోంది. సుమారు నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత వెండితెర మీద రాఖీ భాయ్‌ సందడి చేయనుండటంతో ఫ్యాన్స్‌ ఆ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

చదవండి: హీరో యశ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

కేజీఎఫ్‌–2కి సెలవు కావాలి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు