లంబోర్గినిలో షికారుకెళ్లిన ప్రభాస్‌ సోదరి

12 Apr, 2021 15:52 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఇటీవలే కొత్త కారు కొనుక్కున్న విషయం తెలిసిందే కదా! లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ అనే లగ్జరీ కారును బెంగళూరు నుంచి తన ఇంటికి తెప్పించుకున్నాడు. దీని ధర సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. నారింజ రంగులో మెరిసిపోయే ఈ కారు రోడ్ల మీదకు వచ్చిందంటే అందరి చూపు దీనిమీదే.

ఈ క్రమంలో లంబోర్గిని కారు హైదరాబాద్‌ రోడ్ల మీద చక్కర్లు కొట్టిన పలు వీడియోలు నెట్టింట దర్శనమిచ్చాయి. అయితే వీటిలో ప్రభాస్‌ ఉన్నాడో, లేడో అన్నది స్పష్టంగా తెలియరాలేదు. తాజాగా ప్రభాస్‌ సోదరి, కృష్ణంరాజు-శ్యామల కుమార్తె ప్రసీద ఈ కారులో షికార్లు కొట్టింది. దీని తాలూకు వీడియోను స్వయంగా ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామల సోషల్‌ మీడియాలో పంచుకుంది. దీంతో ఇది కాస్తా నెట్టింట్‌లో వైరల్‌గా మారింది. ప్రసీద ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్‌మేకింగ్‌ నేర్చుకుంటోంది.

మరోవైపు 'జిల్'‌ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన 'రాధేశ్యామ్‌' జూలై 30న రిలీజ్‌ అవుతోంది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ డైరెక్షన్‌లో చేస్తున్న 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. 'కేజీఎఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో చేస్తున్న సలార్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రానుంది.

చదవండి: లగ్జరీ కారులో ప్రభాస్‌ షికార్లు

మహేశ్‌ ‘రామాయణం’.. సీతగా స్టార్‌ హీరోయిన్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు