వైరలవుతున్న రామ్‌ చరణ్‌ కాస్ట్‌లీ వాచ్‌.. ధరెంతో తెలుసా?

10 Apr, 2021 14:22 IST|Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా అది వార్తే అవుతుంది. ఏది తిన్నా, ఎటు వెళ్లినా, ఏం ధరించినా అది సెన్సెషనల్‌ టాపిక్‌గా మారుతుంది. ఇటు అభిమానులు సైతం తాము ఇష్టపడే స్టార్‌ల లైఫ్‌స్టైల్‌ను ఇంట్రెస్ట్‌గా అబ్జర్వ్‌ చేస్తుంటారు. తల నుంచి కాళ్ల వరకు ఏదీ వదలకుండా ఏం ధరించారని జల్లెడ పట్టి మరీ చూస్తుంటారు. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ధరించిన దుస్తులు, వాచ్‌లు, షూస్, హ్యండ్‌బ్యాగ్‌ ఇలా అన్నింటి ధరలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ధరించిన ఓ వాచ్ ఖరీదుపై నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది. చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు చూసిన వారందరూ షాక్ అవుతున్నారు.

ఈ హీరో ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లు అట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర ఏకంగా కోటి 50 లక్షలు. ఈ మధ్యకాలంలో చెర్రీ ఎక్కువగా ఈ వాచ్‌తోనే కనిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ వాచ్ ఖరీదు బయటపడటంతో అంత కాస్ట్‌లీనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదైన వాచ్‌తో సామాన్యులు జీవితాంతం సంతోషంగా బతికేయచ్చు అని అంటుంటే.. మరికొందరు స్టార్స్‌ అన్నప్పుడు ఆమాత్రం ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవర్గం వారు ఆ వాచ్ డబ్బులు పేదవాళ్లకు ఇచ్చిన ఎంతోమంది బాగుపడతారు అంటూ హితవు పలుకున్నారు.

A post shared by Bhimavaram abbai memes 🔥 (@kastha_navvu_babai)

ఇక రామ్‌ చరణ్‌ విషయానికొస్తే.. చరణ్‌ వెండితెరమీద కనిపించి రెండేళ్లు దాటింది. అయినప్పటికీ చెర్రీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ మధ్యలో సైరా నర్సింహరెడ్డి చిత్రానికి నిర్మాతగా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. చెర్రీకి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ నటిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ లోనూ రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్‌  సిద్ధ అనే కీలక పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ రెండిటి అనంతరం స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

చదవండి: రామ్‌చరణ్‌ సపోర్ట్‌ దొరకడం మర్చిపోలేను: యంగ్‌ హీరో
చదవండి: భాగ్యమిత్ర లాటరీ.. సెక్యూరిటీ గార్డు కరోడ్‌పతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు