నన్ను పెళ్లి చేసుకుంటావా?: పాట రూపంలో శ్రీముఖి రిప్లై

26 May, 2021 15:00 IST|Sakshi

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు రాములమ్మ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ఎప్పటిలాగే తిరిగి యూట్యూబ్‌ వీడియోలతో మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండన్న అభిమానుల కోరికకు పచ్చజెండా ఊపింది. ఇక ఓ నెటిజన్‌ ధైర్యం చేసి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని మనసులోని మాట బయటపెట్టడంతో అవాక్కైన శ్రీముఖి 'వద్దురా, సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా..' పాటను గుర్తు చేస్తూ కుదరదని తేల్చి చెప్పింది. పోనీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్‌ అన్న మరొకరి ప్రశ్నకు దానికి సమాధానం తన దగ్గర లేదని బదులిచ్చింది.

మీమర్స్‌ అంటే ఎంతో ఇష్టమన్న శ్రీముఖి ఒకవేళ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధిస్తే మీమ్స్‌ మిస్‌ అవుతానని బాధపడింది. 'మీరు మళ్లీ బిగ్‌బాస్‌ సీజన్‌లోకి రండి అక్క, అప్పుడే మాకు ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుంది' అన్న రిక్వెస్ట్‌కు యాంకర్‌ దిమ్మతిరిగిపోగా.. మంచిది అంటూ దాటవేసింది. తనకు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అంటే క్రష్‌ అని చెప్పింది.

ఎవరితోనైనా రిలేషన్‌లో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, దయచేసి తనను నమ్మండి అని కోరింది. ఇదిలా వుంటే తను కూడా ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యానని, కానీ దాన్నుంచి కోలుకుని రెట్టింపు స్ట్రాంగ్‌గా తయారయ్యానని చెప్పింది. ఇక చాలామంది శ్రీముఖి తమ్ముడు సుష్రుత్‌ గురించి అడిగారు. అతడంటే చాలా ఇష్టమని, పెళ్లి చేసుకోవాలనుందంటూ తమ కోరికను బయటపెట్టారు. ఇది చూసిన శ్రీముఖి.. సుష్రుత్‌తో యూట్యూబ్‌ వీడియోలు చేయాలంటేనే భయంగా ఉంది అని కామెంట్‌ చేసింది.

చదవండి: న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌..షేర్‌ చేసిన యాంకర్‌

శ్రీముఖిలో ఈ టాలెంట్‌ కూడా ఉందా!

మరిన్ని వార్తలు