Lavanya Tripathi : ‘అందాల రాక్షసి’ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

30 Apr, 2021 18:30 IST|Sakshi

‘అందాల రాక్షసి’గా టాలీవుడ్‌కి పరిచమైన హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి, మంచి అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. పెద్దగా హిట్స్‌ లేకపోయినా.. స్టార్‌ హీరోలందరితోనూ నటించే చాన్స్‌ దక్కించుంది. నాని ‘భలే భలే మగాడివోయ్’‌, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాదిలో ఇప్పటికే  ఏ1 ఏక్సప్రెస్, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అవి అనుకున్నంత విజయం సాధించలేదు. ఇదిలా ఉంటే.. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తరచూ అందమైన ఫోటోలు, వీడియోలు పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. తాజాగా ఈ సొట్టబుగ్గల సుందరి ‘వరల్డ్‌ డాన్స్‌ డే’ సందర్భంగా షేర్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు