స్టార్‌ హీరోయిన్‌ బ్యాగు లాగేసిన ఫ్యాన్‌!

26 Feb, 2021 11:42 IST|Sakshi

ముంబై: సెలబ్రిటీలు బయట కాలు మోపితే చాలు కందిరీగల్లా చుట్టుముడుతారు అభిమానులు. మీడియా ప్రతినిధులు కూడా ఫొటోలు, ఇంటర్వ్యూలు అంటూ వెంటపడుతారు. వీరందరినీ దాటుకుని సెలబ్రిటీని కారెక్కించడం కూడా వారి బాడీగార్డులకు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో బయట తినడానికి వెళ్లిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు ఓ వింత అనుభవం ఎదురైంది. ముంబైలోని పాపులర్‌ రెస్టారెంట్‌లో విందు ఆరగించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతుండగా అక్కడున్నవారంతా ఆమెను చుట్టుముట్టారు. దీంతో నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తుండగా ఓ అభిమాని దీపిక హ్యాండ్‌బ్యాంగును పట్టుకు లాగింది. ఒక్కసారిగా షాకైన ఆమె వెంటనే బ్యాగును లాక్కొని ఓ చిన్న నవ్వు విసిరి వెళ్లి కారులో కూర్చొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

దీపిక.. శకున్‌ బాత్రా దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. షారుఖ్‌ ఖాన్‌తో ‘పఠాన్‌’, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ మూవీతో పాటు ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ చిత్రంలోనూ నటిస్తోంది. తన భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన 83లో గెస్ట్‌గా కనిపించనుంది. ఈ సినిమా జూన్‌ 4లో రిలీజ్‌ కానుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్కస్‌’లోనూ దీపిక ఓ చిన్న పాత్రలో మెరవనుందట.

చదవండి: జూన్‌లో ‘83’ వరల్డ్‌ కప్‌

పెళ్ళిలో అజయ్‌ దేవ్‌గణ్‌ డబ్బులు ఆఫర్‌ చేశాడు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు