Naatu Naatu Dance On Road: నడిరోడ్డుపై 'నాటు నాటు' స్టెప్పులు

23 Nov, 2021 15:19 IST|Sakshi

RRR Naatu Naatu Song In Traffic Signal Video Goes Viral: దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రౌద్రం.. రణం.. రుధిరం). పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన  మాస్‌ సాంగ్‌ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే మారుమోగుతుంది. నవంబర్‌ 10న రిలీజ్‌ అయిన ఈ సాంగ్‌ 27మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఇప్పటికీ ట్రిండింగ్‌లోనే ఉంది.

ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాస్‌ సెప్పులు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ పాట స్పూఫ్‌ చేస్తూ పలువురు సోషల్‌ మీడియాలో వీడియోలు వదలుతున్నారు. తాజాగా నడిరోడ్డుపై ట్రాఫిక్‌లో ఓ వ్యక్తి  నాటు నాటు సాంగ్‌కి ఊరమాస్‌ స్టెప్పులేశాడు. రెడ్‌ సిగ్నల్‌ పడగానే బైక్‌పై నుంచి దిగి.. 'నాటు నాటు' సాంగ్‌కి అదిరిపోయేలా డ్యాన్స్‌ చేశాడు.

హెల్మెట్‌ కూడా తీయకుండా తన మాస్‌ బీట్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డ్యాన్స్‌పై అతనికున్న డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదెక్కడి మాస్‌ డ్యాన్స్‌ మామ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు