బోట్ కోసం కీర్తి పరుగులు.. ఆపండి ఆపండంటూ!

27 Mar, 2021 17:06 IST|Sakshi

నేను శైలజ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి సురేష్ ప్రస్తుతం వరుపగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ భామ నటించిన రంగ్‌దే చిత్రం శుక్రవారం(మార్చి16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్‌ హీరో నితిన్‌కు జోడిగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ సంపాదించింది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్‌కు ముందు నుంచే షూటింగ్‌లో జరిగిన ఫన్నీ వీడియోలను సోషల్‌ మడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. నితిన్‌, కీర్తి ఒకరినొకరు ఆటపట్టించడం, కీర్తి రకరకాల చీరలతో కనిపించడం,నలుగురు తినాల్సిన ఆహారాన్ని హీరోయిన్‌ ఒక్కతే తినడం వంటి వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ సినిమా హిట్‌ వైపుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.

తాజాగా మరో వీడియోను కీర్తి తన అభిమానులతో పంచుకుంది. వీకెండ్‌ కోసం పరిగెత్తుతున్నట్లు’ అనే క్యప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియోలో కీర్తి సురేష్ బోట్ కోసం పరుగులు పెడుతూ కనిపిస్తోంది. బోట్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఆపండి అంటూ అరుస్తూ కీర్తి పలుగులు పెట్టడం నెటిజన్ల చేత నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్లర్లు కొడుతుంది. దీనిపై కీర్తి అభిమానులు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో పై మీరూ చూసేయండి.

చదవండి: హీరోయిన్‌ కీర్తి వల్ల బతుకు బస్టాండ్‌ అయ్యింది : నితిన్‌
 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు