తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే!

2 Mar, 2021 18:09 IST|Sakshi

శ్రియ సరన్‌.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయినా చెక్కుచెదరని అందం, అభినయంతో ఆకట్టుకోగల బ్యూటీ. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించిన శ్రియ సరన్‌ ప్రస్తుతం ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్‌తో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ రొమాంటిక్‌ ట్రిప్‌లో భాగంగా పెరులో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించారు ఈ జంట. ఇది 2007లో ప్రపంచంలోని ఏడు కొత్త వింతల్లో ఒకటిగా ఎన్నికైంది. వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు శ్రియ తన సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.  తాజాగా ఈ భామ షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మచ్చుపిచ్చు వద్ద శ్రియ కూర్చొని ఫోటోకు ఫోజ్‌ ఇస్తుండగా పక్కనే ఉన్న ఒంటె ఆమె వద్దకు అకస్మాత్తుగా పరిగెత్తుకు వచ్చింది. దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను ‘టేక్‌ మీ బ్యాక్‌’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కాగా 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఉదయ్‌పూర్‌ వేదికగా మారింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు.

చదవండి: 

సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..

షూటింగ్‌లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు