సైకిల్‌ మీద సోనూ సూపర్‌ మార్కెట్‌, మంచి ఆఫర్‌ కూడా ఉందండోయ్‌!

25 Jun, 2021 09:00 IST|Sakshi

ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చే మంచి మనసున్న వ్యక్తి సోనూసూద్‌. వలస కార్మికులను సొంత గూటికి తరలించి వారి పాలిట దేవుడిగా మారిన సోనూసూద్‌ తాజాగా గుడ్లు, బ్రెడ్డు అ‍మ్ముతూ కనిపించాడు. ఈ మేరకు సోనూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.

ఇందులో సోనూ కూర్చున్న సైకిల్‌ మీద గుడ్లు, బ్రెడ్డు, పావ్‌తో పాటు మరిన్ని సరుకులు ఉన్నాయి. ఈ సైకిల్‌ను సోనూ.. సూపర్‌ మార్కెట్‌గా అభివర్ణించాడు. 10 గుడ్లు కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్‌ ప్రకటించాడు. హోమ్‌ డెలివరీ కూడా ఉచితమే అని చెప్పాడు. ఇంతకీ ఇదేదో సినిమా షూటింగ్‌ అనుకునేరు, కానే కాదు.. చిరు వ్యాపారులను ప్రోత్సహించమని చెప్పేందుకు సోనూ ఈ వీడియో చేశాడు.

A post shared by Sonu Sood (@sonu_sood)

చదవండి:  ఊహించాడు.. అచ్చుం అలాగే చనిపోయాడు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు