స్టెప్పులతో ఇరగదీసిన బామ్మ.. ర్యాపర్‌ ఫిదా

25 Feb, 2021 15:23 IST|Sakshi

60 ఏళ్ల దాటాయంటే ఎవరైన రామా, కృష్ణా అంటూ ఇంట్లో ఖాళీగా కూర్చునేవాళ్లే మనకు తెలుసు.. ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి చెప్పి తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే  బామ్మ మాత్రం సాధారణ వ్యక్తి కాదు. సమ్‌థింగ్ స్పెషల్‌.. ఈ వయసులో నాకెందుకు అని అనుకోకుండా తనకున్న​ టాలెంట్‌ను ప్రదర్శిస్తూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆమె తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. అవును ఆరవై ఏళ్లు పైబడిన బామ్మ పాతికేళ్ల యువకుడితో సమానంగా డ్యాన్స్‌(టిక్‌టాక్‌) వీడియోలు చేస్తుంటుంది. వాటిని అతను తరుచుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. దీంతో బామ్మకు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ కూడా పెరిగిపోయింది.

తాజాగా రష్మిక మందన, ర్యాపర్‌ బాద్‌షా, యువన్‌ శంకర్‌ రాజా కలిసి నటించిన రాప్‌ సాంగ్‌ టాప్‌ టక్కర్‌ అనే పాటకు బామ్మ తన మనవడు అక్షయ్‌ పార్థసారథితో కలసి స్టెప్పులేసింది. పాట లిరిక్‌కు తగ్గట్టుగా కేవలం చేతులు, తల కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది. దీనిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేయగా..ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బామ్మ టాలెంట్‌కు ర్యాపర్‌ బాద్‌షాకు కూడా ఫిదా అయిపోయాడు. ‘నానమ్మ నువ్వు నా టాప్‌ టక్కర్‌’ అంటూ బామ్మ పెర్ఫార్మన్స్‌ వీడియోను రీపోస్టు చేశాడు. 
చదవండి: నజ్రియా నజీమ్‌ ‘వాది’ కమింగ్‌!.. ఎందుకంటే..

A post shared by BADSHAH (@badboyshah)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు