గ్రీన్‌ బికినీలో అనుష్క శర్మ.. భర్త విరాట్‌ రొమాంటిక్‌ కామెంట్‌

16 Nov, 2021 21:15 IST|Sakshi

మోస్ట్‌ సెలబ్రిటీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిలకు సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్‌ ఎక్కువే. విరాట్‌ క్రికెట్‌తోపాటే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఇటీవల దుబాయ్‌ వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి భార్య అనుష్కశర్మ, కూతురు వామికను కూడా తీసుకెళ్లాడు. దుబాయ్‌ నుంచి తిరిగొచ్చేముందు విరుష్క జంట అక్కడ సరదాగా కుటుంబంతో గడిపారు.
చదవండి: Virat Kohli: గట్టిగా అరిచి ఈ ప్రపంచానికి చెప్పాలని ఉంది.. అనుష్క భావోద్వేగం

తాజాగా ఆ ఫోటోలను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నీటిలో గ్రీన్ కలర్ బికినీలో ఫోజు ఇచ్చిన ఫోటోను పోస్టు చేశారు. ఇందులో అనుష్క హాట్‌గా మెరిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోకు అనుష్క భర్త విరాట్ కోహ్లి లవ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేశారు. కాగా విరుష్క జంట 2017లో వైవాహిక బంధంలోకి అడుగపెట్టారు. వీరి వివాహ వేడుకకు ఇటలీ వేదిక అయ్యింది. ఈ ఏడాది జనవరిలో వీరి ప్రేమకు గుర్తుగా కూతురు వామిక జన్మించింది.
చదవండి: 'యువీ నువ్వుంటే బాగుండేది': కోహ్లి.. అనుష్క రియాక్షన్‌ వైరల్‌

అయితే ఇప్పటి వరకు కూతురిని ప్రపంచానికి పరిచయం చేయలేదు. కానీ అప్పడప్పుడు వామికకు సంబంధించిన ఫోటోలను ముఖం కనిపించకుండా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇక అనుష్క చివరిసారిగా జీరో సినిమాలో కనిపించింది. పెళ్లైనప్పటి నుంచి దాదాపు సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పెళ్లై నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు ఏ కొత్త సినిమాను ఓకే చేయలేదు. 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

మరిన్ని వార్తలు