మొక్కకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టిన విశాల్‌ 

2 Nov, 2021 05:06 IST|Sakshi
హైటెక్స్‌ ప్రాంగణంలో మొక్కలు నాటిన సినీనటులు విశాల్, ఆర్య 

మాదాపూర్‌: తాను నాటిన మొక్కకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టారు నటుడు విశాల్‌. ఎనిమీ సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాదాపూర్‌లోని హైటెక్స్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశాల్‌ మాట్లాడుతూ తన స్నేహితుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ గుర్తుగా మొక్కని నాటినట్టు తెలిపారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో ఆయన ప్రారంభించిన ఈ చాలెంజ్‌ గ్లోబల్‌ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్రబృందానికి అందజేశారు. 

మరిన్ని వార్తలు