హీరో విశాల్‌ పాన్‌ ఇండియా చిత్రం ప్రారంభం 

6 May, 2022 08:17 IST|Sakshi

నటుడు విశాల్‌ కథానాయకుడుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం షూటింగ్‌ గురువారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మార్క్‌ ఆంటోనీ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషలలో మినీ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకుముందు విశాల్‌ హీరోగా ఎనిమీ చిత్రాన్ని నిర్మించారు.

ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లాఠీ చిత్రాన్ని పూర్తి చేసిన విశాల్‌ నటిస్తున్న 33వ చిత్రం ఇది. ఆయనకు జంటగా నటి రీతూ వర్మ, ప్రతినాయకుడిగా ఎస్‌.జె.సూర్య నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని, అభినందన్‌ రామానుజన్‌ చాయాగ్రహణం అందిస్తున్నాయి.  
 

మరిన్ని వార్తలు