Vishamakaran: రిలీజ్‌కు రెడీ అయిన విషమక్కారన్‌

26 May, 2022 13:38 IST|Sakshi

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విషమక్కారన్‌ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హనీ ఫ్రేమ్‌ వర్క్స్‌ పతాకంపై విజయ్‌ కుప్పుసామి స్వీయదర్శకత్వంలో కథానాయకుడిగా నటించి, నిర్మించాడు. ఇందులో నటి అనికా విక్రమ్‌, చైత్రారెడ్డి కథానాయికలుగా నటించారు.

జే.కల్యాణ్‌ ఛాయాగ్రహణం, నవీన్‌ ఆదిత్య సంగీతాన్ని అందించారు. హనీ ఫ్లిక్స్‌ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రూపొందించిన చిత్రం ఇదని దర్శక, నిర్మాత తెలిపారు. కొత్త కాన్సెప్ట్‌తో ఒక యువకుడి ఇతివృత్తంతో రూపొందిన అందమైన రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం విషమక్కారన్‌ అన్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ 6లో పాల్గొనాలనుకుంటున్నారా? ఇలా చేయండి
Ramakrishna Reddy: ప్రముఖ నిర్మాత కన్నుమూత

మరిన్ని వార్తలు