గుత్తా జ్వాల పెళ్లి డేట్‌‌ ఫిక్స్‌.. సోషల్‌ మీడియాలో వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్

14 Apr, 2021 08:20 IST|Sakshi

శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, స్నేహితుల ప్రేమ కావాలని ఆహ్వానాలు పంపుతున్నారు తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల. గత ఏడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఈ నెల 22న వివాహం చేసుకోనున్నారు. ఉగాది పర్వదినాన ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఈ ప్రేమికులు వెల్లడించారు.

కోవిడ్‌ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఓ పెళ్లిలో మొదలైన విష్ణు, జ్వాలల పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి, ఇప్పుడు మూడు ముడుల బంధంగా మారనుంది.
 

మరిన్ని వార్తలు