మరికాసేపట్లో వధూవరులుగా మారనున్న లవ్‌ బర్డ్స్‌

22 Apr, 2021 11:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు (ఏప్రిల్‌ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలకు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇక మెహందీ వేడుకలకు గుత్తా జ్వాల పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, బ్లాక్‌ కుర్తాలో విష్ణు విశాల్‌ సందడి చేశారు. ప్రస్తుతం జ్వాల-విశాల్‌ల మెహందీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

కోవిడ్‌ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హీరో విష్ణు విశాల్‌..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. 

మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

చదవండి : కాబోయే భార్య బయోపిక్‌ తీస్తాను: హీరో
గుత్తా జ్వాల పెళ్లి డేట్‌‌ ఫిక్స్‌.. సోషల్‌ మీడియాలో వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్

మరిన్ని వార్తలు