ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్‌ పెళ్లి ఫోటోలు వైరల్

22 Apr, 2021 16:21 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం(ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్‌ ఈ వేడుకకు వేదికైంది. కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

( గుత్తా జ్వాల, విష్ణు పెళ్లి ఫోటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి ) 

ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కోవిడ్‌ కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లివరకు దారితీసింది.


చదవండి:
గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు