యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ

20 Mar, 2023 01:16 IST|Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా కొత్త సినిమా (వీఎస్‌10 వర్కింగ్‌ టైటిల్‌) షురూ అయింది. ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచ్చాన్  చేయగా, రామ్‌ తాళ్లూరి సతీమణి రజనీ క్లాప్‌ ఇచ్చారు. రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా, రామ్‌ తాళ్లూరి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కి అందించారు.

విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘రామ్‌ తాళ్లూరిగారు నాకు ఇష్టమైన నిర్మాత. ఇది నా పదో చిత్రం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘నాకు అవకాశం ఇచ్చిన విశ్వక్‌ సేన్, రామ్‌ తాళ్లూరిగార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు రవితేజ ముళ్లపూడి. ‘‘ఈ సినిమా ప్రేక్షకులు, విశ్వక్‌గారి అభిమానుల అంచనాలకు తగ్గకుండా ఉంటుంది’’ అన్నారు రామ్‌ తాళ్లూరి. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్‌ బిజోయ్, కెమెరా: మనోజ్‌ కాటసాని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సత్యం రాజేష్, విద్యాసాగర్‌. జె.

మరిన్ని వార్తలు