Ashoka Vanamlo Arjuna Kalyanam Movie: విశ్వక్‌ సేన్‌కు పిల్ల దొరికేసింది.. జనవరి 19న

15 Jan, 2022 18:54 IST|Sakshi

Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam Special Glimps Out: 'వెళ్లిపోమాకే' సినిమాతో లవర్ బాయ్‌గా పరిచయమైన విశ్వక్‌ సేన్‌ తర్వాత మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్‌ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. తాజాగా విశ్వక్‌  మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కథకు తగినట్లుగా విభిన్నంగా ప్రమోట్‌ చేస్తూ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. ఇదీవరకు పెళ్లి కోసం చింత మ్యారేజ్ బ్యూరోను సంప్రదించినట్లుగా ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు. 

అలాగే ఇటీవల 'ఇంకా రెండు రోజులే ఉంది. పిల్లని వెతికి పెట్టండి' అంటూ ఓ వీడియో ట్వీట్‌ చేశాడు విశ్వక్‌ సేన్‌. ఆ రెండు రోజులు కాస్త గడిచి సంక్రాంతి రావడంతో పండుగ సందర్భంగా విశ్వక్ సేన్‌కు కాబోయే భార్యను పరిచయం చేశారు. పిల్ల దొరికేసింది అంటూ ఓ వీడియో ద్వారా హీరోయిన్‌ ఎవరో చూపించారు మేకర్స్‌. ఇందులో పసుపులేటి మాధవిగా రుక్సార్‌ దిల్లాన్‌ అలరించనుంది. ఈ హీరోయిన్‌ ఇంతకుముందు కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ సినిమాల్లో నటించింది. వీడియోలో సింగర్‌ రామ్‌ మిరియాల పాడిన 'ఓ ఆడపిల్ల.. నువ్ అర్థం కావా' సాంగ్‌ ఆకట్టుకునేలా ఉంది. సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ లిరిక్‌ సాంగ్‌ అయిన ఈ పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

ఇదీ చదవండి: వ్యాక్సిన్‌ వేయించుకున్నా కరోనా బారిన పడ్డ విశ్వక్‌ సేన్‌

మరిన్ని వార్తలు