మళ్లీ నిరూపించుకోవాలి!

29 Mar, 2021 00:52 IST|Sakshi
విశ్వక్‌ సేన్‌

‘‘సినిమా పరిశ్రమలో లాక్‌డౌన్‌  తర్వాత మార్పు వచ్చింది. మరో కొత్త అధ్యాయం మొదలైనట్లుంది. గత చిత్రాలతో సంబంధం లేకుండా మళ్లీ యాక్టర్స్‌గా నిరూపించుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారు విశ్వక్‌ సేన్‌ . నరేష్‌ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌  హీరోగా ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్న సినిమా ‘పాగల్‌’. ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కానుంది. నేడు విశ్వక్‌సేన్‌  బర్త్‌ డే. ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌  మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేశాను. ‘పాగల్‌’ సినిమా కూడా ఓ కొత్త ప్రయత్నం.

ప్రేమించేప్పుడు కొందరు పిచ్చోడిలా ఆలోచిస్తుంటారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ అలానే ఉంటుంది. అందుకే ఈ టైటిల్‌ పెట్టాం. మా సినిమా టీజర్‌లో ఎంటర్‌టైన్‌ మెంట్‌ మాత్రమే చూపించాం... సినిమాలో  ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి. ఇవాళ్టితో ‘పాగల్‌’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. నా బర్త్‌ డే రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనడం హ్యాపీగా ఉంది. నరేష్‌ బాగా డైరెక్ట్‌ చేశారు. నేను చేస్తున్న ‘ప్రాజెక్ట్‌ గామీ’ సినిమా పూర్తయింది. నిర్మాతలు పీవీపీ, బీవీఎస్‌ఎన్‌  ప్రసాద్‌గార్లతో వర్క్‌ చేయబోతున్నాను. ఈ ఏడాది నావి మూడు సినిమాలు రిలీజవుతాయి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు