Vishwak Sen: రిలీజ్‌కు రెడీ అయిన విశ్వక్‌ సేన్‌ 'దాస్‌ కా దమ్కీ'

24 Nov, 2022 12:34 IST|Sakshi

యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'దాస్‌ కా దమ్కీ'. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలె విడుదలైన ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను వదిలారు. రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది ప్రధాన పాత్రలు పోషించారు.లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ సినిమాతో విశ్వక్‌ మరో హిట్టు కొడతాడేమో చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు