Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ వాయిదా.. ఎందుకంటే?

7 Feb, 2023 16:30 IST|Sakshi

యంగ్ హీరో విశ్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'దాస్‌ కా దమ్కీ'. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తియింది. ఇంతకుముందే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 

ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈనెల 17న దాస్‌ కా ధమ్కీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విడుదల కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'దాస్ కా ధమ్మీ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈసారి థియేటర్లలో గట్టిగా ఇచ్చిపడేద్దాం.' అంటూ పోస్ట్ చేశారు.  కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

A post shared by Vishwaksen (@vishwaksens)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు