న్యూ లవ్‌లో Freshగా పడ్డానంటున్న విశ్వక్‌సేన్‌

3 Jun, 2021 10:17 IST|Sakshi

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘పాగల్‌’. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘‘ఈ సింగిల్‌ చిన్నోడే.. న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే.. సిగ్నల్‌ గ్రీనే చూశాడే.. పరుగులు పెట్టాడే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటని రధన్‌  స్వరపరచగా బెన్నీ దయాల్‌ పాడారు. కృష్ణ కాంత్‌ సాహిత్యం అందించారు. ‘‘మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రమిది. హీరో ప్రతిసారీ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడడం.. ఆ ప్రేమలో ఉన్న తాజాదనాన్ని అనుభవించే సందర్భంలో వచ్చే పాట ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. మణికందన్‌ , సంగీతం: రధన్‌ .

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు