Vishwak Sen : 'పాగల్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

7 Aug, 2021 18:37 IST|Sakshi

టాలెంటెడ్ యంగ్ హీరో విష్వక్‌సేన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎంపిక చేసుకునే చిత్రాలు యూత్ ఆడియెన్స్‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ యంగ్‌ హీరో తాజాగా నటించిన చిత్రం పాగల్‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా రద్దయ్యింది.

ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఆగస్టు14న ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విశ్వక్‌ సేన్‌ ఎర్ర గులాబీని పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా నరేశ్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్‌సేన్‌కు జోడీగా . నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ర‌ధ‌న్ సంగీతం అందిస్తుండగా ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్యవహరించనున్నారు. 

మరిన్ని వార్తలు