డేటింగ్‌‌ సీక్రెట్‌ బయటపెట్టిన వైవా హర్ష..

11 Jan, 2021 12:57 IST|Sakshi

యూట్యూబ్ ద్వారా పాపులారిటి సంపాదించిన వైవా హర్ష అప్పటి నుంచి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల వైవా హర్ష నటించిన కలర్ ఫోటో మూవీ ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బాల ఏసుగా తన నటనతో అందరి మనసు దోచుకున్న వైవా హర్ష ప్రస్తుతం మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక త్వరలోనే హర్ష ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్షర అనే అమ్మాయితో హర్ష నిశ్చితార్ధ వేడుక శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, మిత్రుల మధ్య ఈ వేడుక జరగగా.. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్‌ తేజ్‌, వేష్ణవ్‌ తేజ్‌, సుష్మితా కొణిదెల సందడి చేశారు. తన నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: వైవా హర్ష నిశ్చితార్థం: వైరల్‌గా మారిన ఫొటోలు


తాజాగా హర్ష తన లవ్‌ స్టోరీని మీడియా ముందు వెల్లడించాడు. పీజీ(M.com) చదివిన అక్షర తనకు నాలుగేళ్లుగా పరిచయమని హర్ష తెలిపాడు. స్నేహంగా ఏర్పడిన తమ పరిచయం మెల్లమెల్లగా ప్రేమకు దారితీసిందన్నారు. ‘మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌ ద్వారా అక్షరను నేను కలిశాను. గత నాలుగేళ్లుగా ఆమె నాకు తెలుసు. రెండేళ్ల నుంచి మేము డేటింగ్‌లో ఉన్నాం. ఇద్దరం జీవితాంతం ఒకరికొకరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. అదే జరిగిపోయింది. నేను తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమెతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నా ప్రేమ విషయం చెప్పగానే మా పేరెంట్స్‌ సత్యనారాయణ రావు, రామదేవి త్వరగా ఒప్పుకున్నారు. కానీ అక్షర తండ్రి గౌరీ శంకర్ కొంత సమయం తీసుకున్నాడు.

కానీ అప్పటి వరకు ఆమె నా గురించి తన తండ్రికి చెప్పకపోవడంతో ఆయన కొంచెం భయపడ్డాడు. వాళ్ల అమ్మకు (సత్య) మాత్రమే మా గురించి తెలుసు. అయితే ఒకసారి నేను అక్షర తండ్రితో కొంత సమయం గడిపే సరికి ఆయన నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మా పెళ్లికి అంగీకరించాడు. నిశ్చితార్థ వేడుకలో అతను ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు’  అని వెల్లడించాడు. అదే విధంగా జీవితాంతం అక్షరతో గడపడానికి నేను ఇంకా వేచి ఉండలేనని.. జూన్‌, జూలైలో వివాహం ఉండనున్నట్లు తెలిపాడు. తన సోదరి లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటుందని, ఆమె వచ్చాక పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నాడు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు