Vivek Agnihotri: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై ఇఫి జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్‌

29 Nov, 2022 12:40 IST|Sakshi

గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించడపై జ్యూరీ అధినేత ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. అతడి కామెంట్స్‌పై పలువురు బాలీవుడ్‌ సినీ సెలబ్రెటీల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘గుడ్‌ మార్నింగ్‌.. నిజాలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల చేత అబద్ధాలు చెప్పిస్తుంది’ అంటూ తనదైన శైలిలో నడవ్‌ లాపిడ్‌ చురక అట్టించారు.

చదవండి: హీరోల క్యారవాన్‌ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్‌ కామెంట్స్‌

అంతేకాదు తన ట్వీట్‌కి క్రియేటివ్‌ కాన్షియస్‌నెస్‌(#CreativeConsciousness) అనే హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశాడు. కాగా నడవ్‌ లాపిడ్‌ వ్యాఖ్యలపై ఇప్పటికే నటుడు అనుపమ్‌ ఖేర్‌ స్పందిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. 

మరిన్ని వార్తలు