Vivek Oberoi On Bollywood Nepotism: ‘ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది, అయినా ఎన్నో ఇబ్బందులు’

7 Dec, 2021 15:20 IST|Sakshi

వివేక్‌ ఒబెరాయ్‌.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. హిందీ నుటుడు అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరితులు. తెలుగులో రామ్‌ గోపాల్‌ వర్మ డైరెక్ట్‌ చేసిన రక్త చరిత్ర సినిమాలో నటించి తన నటనతో తెలుగు వారిని మెప్పించారు. ఇక బాలీవుడ్‌లో ఆయన ఓ స్టార్‌ నటుడు.  విలన్‌గా, హీరోగా, సహా నటుడిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని విలక్షణ నుటుడిగా పేరు తెచ్చుకున్నారు వివేక్‌. హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఆయన 20 ఏళ్లపైనే అవుతుంది.

చదవండి: ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ హ్యాట్రిక్‌ సీజన్‌ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

Vivek Oberoi On Bollywood Nepotism

అయినప్పటికీ నటుడిగా తనని తాను నిలదొక్కుకునేందుకు ఇప్పటికి ఆయన కష్టపడుతున్నారంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఈ మాటలు స్వయంగా ఆయనే చెప్పడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వివేక్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో టాలెంట్‌ కంటే ఇంటి పేర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ బి-టౌన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 20 ఏళ్లు నుంచి తాను పరిశ్రమలో ఉన్నప్పటికీ.. నేటికి తన ప్రయాణం ఎంతో కష్టం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వివేక్‌ తాజాగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ మూడవ సీజన్‌ విడుదలైంది.

Bollywood Actor Vivek Oberoi

ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ ప్రమోషన్‌లో భాగంగా వివేక్‌  మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో నెపోటిజంపై ఆయనకు ప్రశ్న ఎదురవగా తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. ఈ మేరకు ‘20 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్న. అయినప్పటికీ నటుడిగా నా ప్రయాణం ఇప్పటికీ కష్టంగా ఉంది. బాలీవుడ్‌.. కొత్త టాలెంట్‌ పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. హిందీ చిత్ర పరిశ్రమను ఎక్స్‌క్లూజివ్‌ క్లబ్‌గా మార్చేశారు. ఇది చాలా బాధించే విషయం. ఇక్కడ రాణించాలంటే ప్రతిభ కంటే ఇంటిపేరు కీలకంగా మారింది. బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలంటే ఇంటిపేరు ప్రముఖులదై ఉండాలి.

చదవండి: 'విడాకుల తర్వాత చనిపోతా అనుకున‍్నా'.. సమంత షాకింగ్‌ కామెంట్స్‌

లేదంటే ప్రముఖులకు బంధువో, లేక తెలిసిన వారై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఇక్కడ అవకాశాలకు, ప్రతిభకు సంబంధం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్‌ నేపోటిజం(బంధుప్రీతి)పై చర్చ సాగుతున్న నేపథ్యంలో హిందీ పరిశ్రమకు చెందిన స్టార్‌ నటుడు ఈ వ్యాఖ్యలు చేయడం హాట్‌టాపిక్‌ మారింది. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో యువ టాలెంట్‌ను నింపేందుకు తన వంతుగా కృష్టి చేస్తున్నానని, వీలైనంతగా కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నానని వివేక్‌ ఒబెరాయ్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు