VJ Sunny: సకల గుణాభిరామ ట్రైలర్​ లాంఛ్​.. ఎమోషనల్​గా వీజే సన్నీ స్పీచ్

5 Feb, 2022 09:17 IST|Sakshi

VJ Sunny Emotional In Sakala Gunabhi Rama Trailer Launch: బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతగా నిలిచిన సన్నీకి సోషల్‌ మీడియాలో యమ క్రేజ్‌ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆటతీరుతో, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ట్రోపీని సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచి తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్‌ అయ్యాడు. ఈ క్రేజ్​తోనే హీరోగా మారాడు. వీజే సన్నీ నటించిన చిత్రం 'సకల గుణాభిరామ'. ఈ సినిమా ట్రైలర్​ లాంఛ్​ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు ముఖ్య అతిథులుగా డైరెక్టర్​ అనిల్​ రావిపూడి, విశ్వక్​ సేన్, బిగ్​బాస్​ కంటెస్టెంట్లు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమానికి విశ్వక్​ సేన్​ అతిథిగా రావడంతో వీజే సన్నీ ఎమోషనల్​ అయ్యాడు. తాను బిగ్​బాస్​ ట్రోఫీ గెలిచేందుకు విశ్వక్​ సేన్​ ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు సన్నీ. 'నేను బిగ్​బాస్ టైటిల్​ కొట్టడానికి కారణం నా స్నేహితులే. వాళ్లే నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తారు. జీవితంలో కావాల్సింది పైసల్​ కాదు. దోస్తులు కావాలి. నా దోస్తులందరికీ నేను హీరో కావాలనే కల ఉండేది. ఆ కలను ఈ చిత్రంతో నిజం చేశాను. 

ఈ కార్యక్రమానికి పిలవగానే విశ్వక్ సేన్​ అన్న, అనిల్​ అన్నా వచ్చారు. నేను బిగ్​బాస్​ హౌజ్​లో ఉన్నప్పుడు విశ్వక్​ సేన్​కు నేను ఎవరో తెలియదు. కానీ నాకు చాలా సపోర్ట్​ ఇచ్చారని బయటకు రాగానే నా స్నేహితులు చెప్పారు. విశ్వక్​ సేన్​ అన్న ఎంత సపోర్ట్​ చేశారో.. అనిల్ రావిపూడి అన్న అంతే సపోర్ట్​ చేశారు. నేను బయటకు రాగానే అన్నని కలిశాను. వాళ్ల డాటర్ కేక్​ కట్​ చేసిన వీడియో నాకు చూపించేసరికి నేను ఫిదా అయిపోయా. థాంక్యూ అన్నా.' అని తెలిపాడు వీజే సన్నీ.

మరిన్ని వార్తలు