కారు సృష్టించే కలకలం నేపథ్యంలో ‘సర్కస్ కార్-2’

27 Nov, 2021 12:50 IST|Sakshi

ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్ని రోజులు గడిచినా ఆ కారు సొంతదారు ఎవరో తెలియదు. ఆ ఊరివారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? వంటి ఆసక్తికర కథ-కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ‘సర్కస్ కార్-2’. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన ‘సర్కస్ కార్’కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. 

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ... ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్... ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ‘సర్కస్ కార్-2’ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది.  పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ ‘సర్కస్ కార్-2’కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి’ అన్నారు.  బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు