హైదరాబాద్‌ గణేష్‌ మండపాల వద్దకు టీవీ సీరియల్‌ నటీనటులు.. ఎవరో తెలుసా?

21 Sep, 2023 19:53 IST|Sakshi

హైదరాబాద్‌లో వినాయకుడి పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా బొజ్జ గణపయ్య మండపాలు వేల సంఖ్యలో ఉంటాయి. వినాయకుడి పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసార అయ్యే 'ఒంటరి గులాబి' సీరియల్‌ టీమ్‌ వారు ఒక విభిన్నమైన ప్రచారానికి తెరలేపారు. వారందరూ కలిసి హైదరాబాద్‌లోని ప్రతి వినాయకుడి మండపాన్ని సందర్శించనున్నారు. నగరంలోని నలుమూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా వారు సందర్శించనున్నారు.

అంతేకాకుండా అక్కడ గణేష్ పూజలో పాల్గొని..  అక్కడి నిర్వాహకులతో పాటు భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తారు. అలా మీ ప్రేక్షక అభిమాన నటినటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ త్వరలో రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా దిల్‍సుఖ్‍నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సరూర్ నగర్ నవజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను 'ఒంటరి గులాబి' సీరియల్లో లీడ్‌ రోల్‌లో నటించిన నటీనటులు సందర్శించారు.

ఈ సీరియల్‌లో హీరో,హీరోయిన్‌గా నటిస్తున్న  బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) నేరుగా గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు. వారితో ఫోటోలు దిగిన స్థానికులు ఎంతో సంబరపడుతున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సీరియల్‌ మేకర్స్‌కు వచ్చిన విభిన్నమైన ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

మరిన్ని వార్తలు