ఎమోషనల్‌ వృషభ

28 Jul, 2023 01:03 IST|Sakshi
జీవన్, అలేఖ్య 

జీవన్, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో యుజిఓస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ఉమాశంకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి ఎమోషన్‌ ఉన్నట్లనిపిస్తోంది’’ అని ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో పాల్గొన్న నిర్మాత సి. కల్యాణ్‌ అన్నారు. ‘‘1966–1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆధ్యాత్మికంగా వెళుతూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్‌ని చూపించాం’’ అన్నారు అశ్విన్‌. ‘‘ఓ పల్లె లోని చిన్న గుడిలో ఈ కథ నా మదిలో మెదిలింది’’ అన్నారు ఉమాశంకర్‌. 

మరిన్ని వార్తలు