వాయిస్‌ ఆర్టిస్ట్‌గానే నా కెరీర్‌ ముగుస్తుందనుకున్నా : జరీనా సాహిబ్‌

18 Jul, 2021 10:05 IST|Sakshi

పట్టుదలతో శ్రమిస్తే.. దేనినైనా సాధించొచ్చని నిరూపించింది జరీనా షాహిబ్‌. తొలి సిరీస్‌తోనే వరుస సినిమా అవకాశాలను సాధించిన ఆమె గురించి కొన్ని వివరాలు...

►   ముంబైలో పుట్టి పెరిగిన జరీనా.. చెన్నై ఐఐటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పూర్తి చేసింది. 
   చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. ఆ ఆసక్తితోనే  కాలేజీ రోజుల్లో నాటకాలు వేయడం మొదలుపెట్టింది. అలా డ్రామా ఆర్టిస్ట్‌గా సుమారు ఆరు సంవత్సరాలు పనిచేసింది.
 సినిమాల్లో నటించాలనే తన కలను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడింది. అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లింది.  
 అలా ఒకసారి ఆమె ఆడిషన్‌ తీసుకున్న  వ్యక్తి ‘నీ వాయిస్‌ బాగుంది. వాయిస్‌ ఆర్టిస్ట్‌గా ట్రై చేయ్‌’ అని సలహా ఇచ్చాడు. చలనచిత్ర రంగంలోనే  స్థిరపడాలనే  లక్ష్యంతో కొంతకాలం వాయిస్‌ ఆర్టిస్ట్‌గా స్వరంతోనూ అభినయించింది.   


   వెండితెర మీద చాన్స్‌ రాకపోయినా  వెబ్‌తెర మీద వచ్చింది.
    2019లో, అమెజాన్‌ ప్రైమ్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 1లో నర్స్‌గా చేసింది.  
   సినిమా ఆపర్చునిటీని ఆమె దరికి చేర్చింది ‘ఫ్యామిలీ మ్యాన్‌’లోని ఆమె నటనే. 
    ప్రస్తుతం ‘రష్మీ రాకెట్‌’తో పాటు, ‘ఇండియన్‌ లాక్‌ డౌన్‌’ సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తోంది జరీనా.
నా కెరీర్‌ ఇక వాయిస్‌ ఆర్టిస్ట్‌గానే ముగిసిపోతుందేమో అని అనుకునే టైమ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్‌’లో అవకాశం లభించింది. ఎప్పటికైనా సినిమాల్లో హీరోయిన్‌గా నటించడమే నా లక్ష్యం. – జరీనా షాహిబ్‌. 

మరిన్ని వార్తలు