థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ విడుదల

5 Dec, 2020 06:06 IST|Sakshi

హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదిలో తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు అదే రోజు హెచ్‌బీఓ మ్యాక్స్‌లో స్ట్రీమ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మించిన ‘వండర్‌ ఉమెన్‌’ థియేటర్స్‌లోనూ, హెచ్‌బీఓ మ్యాక్స్‌లోనూ ఒకేరోజు విడుదల కానుంది. అదే పద్ధతిని వచ్చే ఏడాది సినిమాలకు కూడా పాటించనున్నారు. ‘‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

సినిమాను థియేటర్స్‌లోనే ప్రదర్శించాలని అందరికీ ఉంటుంది. కానీ వచ్చే ఏడాది మొత్తం సగం సీటింగ్‌ కెపాసిటీతోనే థియేటర్స్‌ నడుస్తాయి. సో... ఏ విధంగా వీలుంటే ఆ విధంగా (ఇంట్లోనో, థియేటర్లోనో) సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అని వార్నర్‌ బ్రదర్స్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది వార్నర్‌ బ్రదర్స్‌ విడుదల చేసే సినిమాల్లో ‘డ్యూన్, మ్యాట్రిక్స్‌ 4, టామ్‌ అండ్‌ జెర్రీ, గాడ్జిల్లా వర్సెస్‌ కింగ్‌ కాంగ్, ది కంజ్యూరింగ్, ది సూసైడ్‌ స్క్వాడ్‌’ వంటి సినిమాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు