షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్

17 Aug, 2021 13:32 IST|Sakshi

సత్యదేవ్ ఈ పేరుకి తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ నటుడు ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే గాక ఇటీవలే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టాడు. ప్ర‌స్తుతం సత్యదేవ్ తీవ్రవాదం నేపథ్యంలో రూపొందుతున్న‌ హ‌బీబ్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వ‌ర‌లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు.

హబీబ్ చిత్రం చిత్రీకరణ సమయంలో.. తీవ్ర ఆటంకాలు, ప్రమాదాల నడుమ భయపడుతూ రూపొందించినట్లు తెలిపాడు. ఎందుకంటే గత కొంత కాలంగా ఆఫ్ఘన్ దేశాన్ని తాలిబన్లు తిరిగి దక్కించుకునేందుకు భీకరంగా పోరాటం సాగిస్తున్న క్రమంలో చిత్ర బృందం ఆ దేశానికి వెళ్లి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రాణాలకు రిస్కీ అని తెలిసినా సత్యదేవ్ కథ కోసం షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇదిలా వుండగా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరించారని తెలిపాడు. ఆర్మీ తరహా దుస్తులు ధరించి సత్యదేవ్ పై చిత్రీకరణను చేయగా అతడి వేషధారణ కారణంగా ఒక దశలో తాలిబాన్ అని పొరపాటు పడ్డారట.

స్థానిక పోలీసుల కోసం సందేహాలను నివృత్తి చేయడానికి భారత రాయబార కార్యాలయం వారి ఆధారాలను చూపించాల్సి వచ్చిందట. ప్రమాదకర ప్రాణహాని ఉన్నా సినిమా పై తనకు ఉన్న ఫ్యాషన్ని ఈ నటుడు  విడ‌వ‌క‌పోవ‌డం విశేషం. ఇటీవల సత్యదేవ్ తిమ్మ‌ర‌సు చిత్రంతో ప్రేక్ష‌కుల మందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు