షూటింగ్‌లో లైట్‌మన్‌ మృతి.. కుటుంబానికి నిర్మాత ఆర్థికసాయం

4 May, 2023 10:43 IST|Sakshi

నటుడు సత్యరాజ్‌, వసంత రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వెపన్‌'. ఎంఎస్‌.మన్సూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. గుహన్‌ సెన్నియప్పన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో ఓ దుర్ఘటన జరిగింది. ఎస్‌.కుమార్‌ అనే లైట్‌మన్‌ ప్రమాదవశాత్తూ మరణించాడు.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్)

దీంతో అతని కుటుంబానికి వెపన్‌ చిత్ర నిర్మాత ఎంఎస్‌. మన్సూర్‌ రూ.12 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బుధవారం చెక్కు రూపంలో లైట్‌మన్‌ కుమార్‌ భార్య జూలియట్‌, పిల్లలకు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.పెల్వమణి, లైట్స్‌మన్‌ యూనియన్‌ అధ్యక్షుడు సెంథిల్‌, మేనేజర్‌ కందన్‌ల చేతుల మీదుగా అందించారు.

ఈ సందర్భంగా నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ లైట్‌మన్‌ కుమార్‌ మృతి తన కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు బాధిస్తోందన్నారు. వృత్తి కోసం రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి మరణం మనసును కలచివేస్తోందన్నారు. కుమార్‌ లేని లోటు అతని కుటుంబానికి ఎవరూ తీర్చలేనిదన్నారు. అందుకే తాను ఓదార్పుగా చిన్న మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిపారు. 

(ఇది చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్‌ కోసం తంటాలు!)

మరిన్ని వార్తలు