షాకిచ్చిన హీరో.. ఈ నెల 24న పెళ్లి?!

19 Jan, 2021 10:37 IST|Sakshi

పది రోజుల క్రితమే బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్‌గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్‌లో వరుణ్‌ ధావన్‌ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి’’ అని న్యూస్‌ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్‌ లాంగ్‌ టైమ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ నటాశా దలాలే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్‌ చేసింది: కానీ, నమ్మకంతో..)

ఇక వీరిద్దరు గతేడాది మార్చిలోనే వివాహం చేసుకోవాలని భావించారట. కానీ కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ కారణంగా వివాహాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారట. మొత్తానికి 2021 వరుణ్‌ ధావన్‌ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్‌ ‘జగ్‌ జగ్‌ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు