మంచి ముగింపు

13 Sep, 2020 02:31 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్‌, పూజా హెగ్డే, సమంత, శ్రుతీహాసన్‌

వారానికి క్లైమాక్స్‌ లాంటిది వీకెండ్‌. క్లైమాక్స్‌ బావుంటేనే సినిమా బాగా ఆడుతుంది. వీకెండ్‌ బావుంటేనే కొత్త వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించగలుగుతాం. మరి ఈ వీక్‌ను ఏ స్టార్‌ ఎలా ఎండ్‌ చేస్తున్నారో చూద్దామా?

లాక్‌డౌన్‌లో యోగా మీద ధ్యాస పెట్టారు సమంత. కష్టతరమైన ఆసనాలు ప్రాక్టీస్‌ చేశారు. చాలా వరకూ నేర్చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు సమంత. శనివారం 108 సూర్య నమస్కారాలు చేశారామె. ‘వీకెండ్‌కి మంచి స్టార్ట్‌’ అన్నారు సమంత. తెలుగు సినిమాకు డబ్బింగ్‌ చెప్పాలన్నది పాయల్‌ రాజ్‌పుత్‌ కోరిక. ఈ వీకెండ్‌ ఆ పని మీదే ఉన్నారు. తెలుగులో తాను నటిస్తున్న తాజా చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం మొదలెట్టారు.

‘డబ్బింగ్‌ చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను... ఇప్పటికి కుదిరింది. త్వరలోనే నా తెలుగు ఎలా ఉంటుందో మీరూ వింటారు’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. లాక్‌డౌన్‌లో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ప్రారంభించారు శ్రుతీహాసన్‌. బాక్సింగ్‌ క్లాసుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘శారీరకంగా బలంగా తయారైతేనే మానసికంగానూ బలంగా ఉండగలం’ అన్నారు శ్రుతి. వీకెండ్‌లోనూ నో హాలీడే. ఫుల్‌ బాక్సింగ్‌ ట్రైనింగ్‌లో ఉన్నారామె. వీకెండ్‌ సందర్భంగా పూజా హెగ్డే ‘షెఫ్‌ పూజా’ అయ్యారు. పూజా తన తండ్రి కోసం కాక్‌టేల్‌ తయారు చేశారు. టేస్టీ కాక్‌టేల్‌ ఎలా చేయాలో రెసిపీ కూడా పంచుకున్నారు.
ఇలా అందాల తారలు ఈ వారాన్ని తమకు నచ్చినట్లుగా ముగించి, వచ్చే వారాన్ని హ్యాపీ మూడ్‌తో ఆహ్వానించడానికి రెడీ అయ్యారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా