వీటి పేర్లు చెప్పుకోండి చూద్దాం!

14 Sep, 2020 19:39 IST|Sakshi

పెట్‌ లవర్స్‌.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనుషుల మీద ఎంత ప్రేమ చూపిస్తారో అంతకంటే పెంపుడు జంతువులపై ఒకింత ప్రేమ ఎక్కువే. ప్రతి విషయంలోనూ వాటిని ఇంట్లో మనుషుల్లాగానే జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే ఎక్కువ మంది పెట్స్‌లో కుక్కలను పెంచుకునేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతారు. వీరిలో సెలబ్రిటీలూ లేకపోలేదు. నటి అక్కినేని అమల.. జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఆమె బ్లూ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నారు. ఇక ఆ ఇంటికి పెద్ద కోడలిగా అడుగు పెట్టిన సమంతకు కూడా పెంపుడు జంతువులంటే పిచ్చి. ప్రస్తుతం సమంత ఇంట్లో రెండు జాతుల కుక్కలు ఉన్నాయి. (108 సార్లు సూర్య నమస్కారాలు: సమంత)

సామ్‌కు ఆ కుక్కలంటే చచ్చేంత ప్రేమ. వీటిని అత్యంత ప్రేమగా, అపురూపంగా చూసుకుంటారు. సామ్‌, నాగ చైతన్య ఇద్దరు వాటికి హానీ కలగకుండా కంటికి రెప్పలా జాగ్రత్తగా పెంచుకుంటారు. ఎక్కడికి వెళ్లిన తమ  వెంట ఇవి ఉండాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో ఈ రెండు కుక్కలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. వీటితో సరదాగా గడుపుతూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. మరి సమంత పెంచుకునే కుక్కలా పేర్లు ఎంటో తెలుసా.. (నితిన్‌ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!)

‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే అనంతరం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగారు. అరవింద సమేద, అల వైకుంఠపురములో వంటి వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో జోడీగా రాధే శ్యామ్‌ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లోనూ నటిస్తున్నారు. ఇక చాలామందికి తెలియని విషయమేంటంటే పూజా కూడా జంతు ప్రేమికురాలే. ప్రస్తుతం ఆమె వద్ద ఓ జాతి కుక్క ఉంది. దానితోనూ ఎంతో సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లోనూ షేర్‌ చేస్తూ ఉంటారు. మరి పూజా పెంచుకుంటున్న కుక్క పేరు మీకు తెలుసా.. వీలైతే కనుక్కునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ మీ వాళ్ల కాదు అంటే ఇక మేమే సమాధానం చెప్పేస్తాం..

సమాధానాలు..
సమంత పెంపుడు కుక్కల పేర్లు :హాష్‌ అక్కినేని, డ్రోగో అక్కినేని
పూజా హెగ్డే పెంపుడు కుక్క పేరు : బ్రూనో

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా