‘రోజా’ పాటల రికార్డింగ్ సమయంలో బాలు ఏమన్నారంటే

26 Sep, 2020 17:32 IST|Sakshi

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తను ఇప్పటికీ ఎవరూ జీర్జించుకోలేకపోతున్నారు. ఇక నుంచి బాలు తమ మధ్య లేరు అనే వార్త అభిమానులు, సెలబ్రిటీల చేత కంటతడి పెట్టిస్తోంది. ఎస్పీబీకి సినీ ప‌రిశ్ర‌మ‌లో అంద‌రితోనూ ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ఆనాటి త‌రం నుంచి ఈ త‌రం వ‌ర‌కు ప్రతి ఒక్క‌రితోనూ ఏదో విధంగా అనుబంధం ఉంది. బాలుకు  ప్ర‌త్యేక అనుబంధం వ్య‌క్తుల్లో ఏఆర్ రెహ‌మాన్ ఒకరూ. ఎస్పీబీ చ‌నిపోయార‌ని తెలిసిన వెంట‌నే రెహమాన్‌ స్పందించారు. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మ‌ర‌ణంతో సంగీత ప‌రిశ్ర‌మలో వినాశనం చోటుచేసుకుంద‌ని భావోద్వేగానికి లోన‌య్యారు. ఆయ‌న‌కు మ‌న‌స్పూర్తిగా నివాళులు అర్పించారు. (మీ స్వరం అన్ని వేళలా తోడుగా ఉంది)

సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ బాలసుబ్రహ్మణ్యం అంటే ప్రత్యేక అభిమానం ఉంది. ఈ మేర‌కు బాలు గారితో ఉన్న బంధానికి సంబంధించిన ఓ వీడియోను రెహ‌మాన్  సోష‌ల్ మీడియాలో షేర్‌చేశారు. రెహమాన్ తొలి సినిమా రోజా పాట రికార్డింగ్ సమయంలో ఎస్పీబీతో సంభాషించిన విష‌యాల‌ను ఈ వీడియోలో వెల్ల‌డించారు. ‘‘రోజా సినిమాలో ‘నా చెలి రోజావే’ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న స‌మ‌యంలో బాలసుబ్ర‌హ్మ‌ణ్యం స్టూడియోలోకి వ‌చ్చారు. వ‌చ్చి వెంట‌నే ఈ స్టూడియో ఓ సినిమా పాట‌ను ఎలా కంపోజ్ చేయ‌గ‌ల‌రు అని చెప్పారు. కానీ నేను న‌వ్వి అక్క‌డి నుంచి వ‌చ్చాను. సినిమా విడుద‌లైన త‌ర్వాత బాలు గారు ఇలా చెప్పారు. సంగీతాన్ని ఎక్క‌డైనా నిర్మించ‌వ‌చ్చ‌ని మీరు నిరూపించారు. అని రెహమాన్‌ వెల్లడించారు. (ఎస్పీ బాలు అంత్యక్రియలు పూర్తి)

అలాగే ‘కేవలం 15 నిమిషాల్లో పాట నేర్చుకొని 10 నిమిషాల్లో పాడేయగలరు. ఇలాంటి గాయకుడిని నేను ఎప్పుడూ చూడలేదు’. అని రెహమాన్‌ తెలిపారు. కాగా 1992 లో వచ్చిన రోజా సినిమాతో ఏఆర్ రెహమాన్ స్వరకర్తగా అరంగేట్రం చేశారు. బాలు-రెహమాన్‌ కలిసి పనిచేయడం ఇదే మొదటిది. రోజా సినిమా సమయానికి బాలసుబ్రహ్మణ్యం సంగీత పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. అనంతరం రెహమాన్‌ సంగీతంలో బాలు నుంచి అనేక పాటలు వచ్చాయి. అయితే  శివాజీ సినిమా తర్వాత రెహమాన్ కోసం బాలు పాడిందేలేదు. ఇదిలా ఉండగా చెన్నై శివార్లలోని ఫామ్ హౌస్‌లో బాలు అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. (బాలును వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది)

మరిన్ని వార్తలు